ఎన్టీఆర్ జయంతి సందర్బంగా పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..!

Pawan Kalyan's special tweet on the occasion of NTR Jayanti..!
Pawan Kalyan's special tweet on the occasion of NTR Jayanti..!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గారు ఒక స్పెషల్ ట్వీట్ చేశారు. ‘తెలుగు నుడికారానికి, తెలుగు నేలకి .. తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో ఎన్టీఆర్ ఒకరని తెలుగు వారు గర్వం గా చెప్పుకోవచ్చు.

Pawan Kalyan's special tweet on the occasion of NTR Jayanti..!
Pawan Kalyan’s special tweet on the occasion of NTR Jayanti..!

అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను అని అన్నారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన శైలి అజరామరం. రెవెన్యూ వ్యవస్థలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు, రెండు రుపాయలకే పేదలకి బియ్యం వంటి పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆయన జయంతి ని పురస్కరించుకుని ఎన్టీఆర్కు జనసేన పార్టీ తరఫున, తన తరఫున నివాళులు అర్పిస్తున్నా అని పవన్ అన్నారు.