ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం అమ్మాయిలే తొందర పడుతున్నారు… షాకింగ్ సర్వే !

NFHS Survey on Girls and Boys sex before Marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సెక్స్ గురించి మాట్లాడేందుకే సిగ్గుపడే భారతీయులు ఇప్పుడు అదే పనిలో ఉంటున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బయట పెట్టింది. ఒకప్పుడు దాని గురించి ఆలోచించడానికే ఇబ్బంది పడినవారు ఇప్పుడు టెక్నాలజీ చేసిన అద్భుతాల వాళ్ళ తమ భయాలు, ఆసక్తులు గురించి జోరుగా గూగుల్ చేసేస్తున్నారు. ఆడ, మగ మధ్య సెక్స్ విషయంలో ఇప్పడు చాలామంది పెళ్ళి వరకు ఆపుకోవడం లేదనేది ఓపెన్ సీక్రెట్. లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లూ, బహిరంగ లిప్ లాక్‌లు, హగింగ్ లు మామూలయిపోయాయి. ఇంతకూ భారత యువతీ యువకులు తొలి లైంగిక అనుభవాన్ని ఏ వయసులో పొందుతున్నారు? దేశంలోని వివిధ ప్రాంతాల్లో లైంగిక అనుభవాలు పరిస్థితులను బట్టి సామాజిక పరిస్థితులను బట్టి మారుతున్నాయా? ఉత్తరాదివారికి, దక్షణాదివారికి ఈ విషయంలో ఉన్న తేడా ఏమిటి? వంటి అనేక ఆసక్తికర విషయాలని ఈ సర్వే బయటపెట్టింది. దేశంలో లైంగిక జీవితంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2015-16లో దేశవ్యాప్తంగా జరిపిన ఈ సర్వే వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ఆ సర్వే లో హై లైట్స్

దక్షిణ భారతదేశంలోని వారితో పోల్చుకుంటే… ఉత్తర భారత దేశంలోని వారు లైంగిక జీవితంలో చురుగ్గా ఉంటున్నారని సర్వేలో తేలింది.

90 శాతానికి పైగా భారతీయులు 30 ఏళ్లలోపే తమ మొట్టమొదటి లైంగిక అనుభవాన్ని పొందుతున్నారు.

పురుషుల్లో ఎక్కువ మంది 20-24 ఏళ్లలోపే తమ మొట్టమొదటి లైంగిక అనుభవాన్ని పొందుతున్నారు. ఇక మహిళల్లో తొలి లైంగిక అనుభవం ఎక్కువగా 15-19 సంవత్సరాల మధ్య ఉంటోంది.

తొలి లైంగిక అనుభవం పొందడంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసానికి కారణం వారు పెళ్లిచేసుకునే వయసే. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ముందుగా పెళ్లవుతుంది కాబట్టి లైంగిక అనుభవాన్ని కూడా వారే ముందుగా పొందుతున్నారని ఆ సర్వే తేల్చింది. అయితే చదువుకునే అమ్మాయిలు తొలి లైంగిక అనుభవాన్ని కాస్త ఆలస్యంగా పొందుతున్నారు. కనీసం ఇంటర్ వరకు చదువుకునే అమ్మాయిలు పెళ్లి కాస్త ఆలస్యంగా చేసుకుంటడంతో వీరు తొలి లైంగిక అనుభవం 20-24 ఏళ్లలోపు ఉంటోందట.

పెళ్లికి ముందు సెక్స్ అన్నది దేశంలో చాలా ప్రాంతంలో తప్పుగా భావిస్తున్నారు. 15-24 వయసులో ఉన్న ఒంటరి పురుషుల్లో 11 శాతం మంది… 2 శాతం మంది మహిళలు మాత్రమే పెళ్లికి ముందు సెక్స్ చేసినట్లుగా చెప్పుకున్నారు.
పెళ్లికి ముందు సెక్స్ చేసిన వారిలో అత్యధికంగా చత్తీస్ గఢ్ లో 21.1శాతం మంది ఉండగా… తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ 20.7 శాతంలో నిలిచింది.

హర్యానా, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో సర్వేలో పాల్గొన్న దాదాపు 55 శాతం మంది పురుషులు, స్త్రీలు… సర్వే జరగడానికి నాలుగు వారాల ముందు నుంచి కూడా సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. చురుకుగా సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పిన ఇతర రాష్ట్రాలకు చెందినవారిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు.

ఒంటరి మహిళలు… పురుషులు తాము ఎక్కువగా సెక్స్ లో పాల్గొన్నది తమ బాయ్ ఫ్రెండ్ తో కానీ గర్ల్ ప్రెండ్స్ తో కానీ అని చెప్పటం గమనార్హం. 70 శాతం మంది పురుషులు తమ గాళ్ ఫ్రెండ్ తో శృంగారంలో పాల్గొన్నట్లుగా చెబితే.. దాదాపు 65 శాతం మంది మహిళలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో సెక్స్ చేసినట్లు వెల్లడించారు.

సహజీవనం చేస్తున్న వారితో సెక్స్ చేస్తున్న విషయంలో మహిళలు… పురుషులు ఒకేలా ఉన్నారు. అనుకోకుండా కలిసిన వ్యక్తితో సెక్స్ చేసే విషయంలో పురుషులు ముందు ఉంటే… మహిళలు వెనుకే ఉన్నారు. ఇక… కమర్షియల్ సెక్స్ వర్కర్లతో శృంగారం విషయంలో పురుషులు ఎక్కువగా ఉంటే… మహిళలు తక్కువగా ఉండటం గమనార్హం.

దేశ వ్యాప్తంగా చూస్తే సర్వేకు ముందు నాలుగు వారాలుగా సెక్స్ చేసుకుంటున్న వారిలో 47 శాతం మంది పురుషులు, 48 శాతం మంది స్త్రీలు ఉన్నారు. ఈ గణాంకాలు వారు స్వయంగా చెప్పినవే తప్ప వీటిలో ఎంతవరకు వాస్తవం అన్నది నిర్ధారణ జరగలేదు.