రంగస్థలం ఊరు వైపు జనాల పరుగులు

People are going to see rangasthalam movie settings.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ సూపర్‌ హిట్‌ అయ్యింది. మొదటి వారం రోజుల్లోనే ఏకంగా 82 కోట్ల షేర్‌ను రాబట్టి 100 కోట్ల షేర్‌ వైపుకు దూసుకు పోతుంది. భారీ అంచనాల నడుమ 1980 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పటి పరిస్థితులను కల్లకు కట్టినట్లుగా చూపించేలా సెట్టింగ్స్‌ వేసి అబ్బురపర్చారు. ప్రతి విషయాన్ని ఎంతో డీటైల్డ్‌గా చూపించి వారెవ్వా అనిపించారు. రంగస్థలం సక్సెస్‌కు సగం కారణంగా అప్పటి పరిస్థితులను అద్దం పట్టేలా ఉన్న సెట్టింగ్స్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

పల్లెటూరు అదీ కాకుండా 1980 పరిస్థితులను చూపించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ చిత్రాన్ని మొదట ఎక్కువ శాతం గోదావరి పరిసర ప్రాంతాల్లోని పల్లెటూర్లలో చిత్రీకరించాని భావించారు. కాని ఈ చిత్రం షూటింగ్‌కు అక్కడ జరిపేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అందుకే ఎక్కువ శాతం హైదరాబాద్‌లో వేసిన పల్లెటూరు సెట్టింగ్‌లో చిత్రీకరించడం జరిగింది. అద్బుతమైన ఆ సెట్టింగ్‌ను చూసేందుకు ప్రస్తుతం జనాలు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. పెద్దగా సెక్యూరిటీ లేకపోవడంతో పాటు, మీడియా వారికి అనుమతి ఇస్తున్న కారణంగా జనాలు ఆ సెట్టింగ్స్‌ను చూసేందుకు వెళ్తున్నారు. సాదారణంగా అయితే సినిమా పూర్తి అయిన వెంటనే సెట్టింగ్స్‌ను తొలగిస్తారు. కాని రంగస్థలం సక్సెస్‌ అవ్వడం, ఆ సెట్‌కు మంచి పేరు రావడంతో దాన్ని అలాగే ఉంచాలనే నిర్ణయానికి వచ్చారు. హైదరాబాద్‌లో సెలవు రోజు రాగానే రంగస్థలం సెట్‌కు వెళ్లేందుకు ఎక్కువ మంది జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది రంగస్థలం సెట్స్‌కు వెళ్లినట్లుగా తెలుస్తోంది.