ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన ఓ మాట ఇప్పుడు మొత్తం ఏపీ రాజకీయ వర్గాల్లోనూ మరియు సోషల్ మీడియాలోనూ వైరల్ టాపిక్ గా మారిపోయింది.ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్ పై అటు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన కామెంట్స్ కంటే కూడా ఇప్పుడు జగన్ చేసిన కామెంట్స్ మరింత వైరల్ అవుతుండడం ఆశ్చర్యకరం.
కెసిఆర్ అన్నట్టుగానే కరోనాను సాధారణ పారాసిటమాల్ టాబ్లెట్ తో అరికట్టొచ్చని జగన్ ఒక్క మాట అన్నారు అంతే ఆ ముక్కను పట్టుకొని అటు టీడీపీ,బీజేపీ జనసేన సహా సామాన్య నెటిజన్లు కూడా జగన్ పై ఒక రేంజ్ లో ట్రోల్స్ వేస్తున్నారు.”అసలు ఈ విషయం తెలీకే పలు దేశాల్లో జనాభా చనిపోతున్నారు,వైద్యులు ఇన్ని కష్టాలు పడి మందును కనుక్కోడానికి నానా అగచాట్లు పడుతున్నారు” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
మరికొందరు అయితే జగన్ కు ఉన్న పరిజ్ఞ్యానం ఈ దెబ్బకు తెలిసిపోయింది అంటూ రకరకాలుగా మరికొందరు ఇంకా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.అయితే జగన్ చెప్పదలచుకుంది సరిగ్గా ప్రెజెంట్ చెయ్యకపోవడం వలనే సోషల్ మీడియాలో మరియు ప్రతిపక్ష పార్టీల నేతలతో ఇన్ని విమర్శలు ఎదుర్కుంటున్నారని చెప్పాలి.నిజానికి జగన్ చెప్పదలచుకుంది.ఆరోగ్యం బాగోలేని సమయంలో ప్రాథమికంగా తీసుకునే ఔషధాల్లో పారాసిటమాల్ కూడా ఒకటి అని చెప్పారు తప్ప దీని వల్లే పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పడం తన ముఖ్య ఉద్దేశ్యం కాదని చెప్పాలి.