దారుణం: మహిళను సజీవంగా కొట్టి పాతిపెట్టాడు……

మత్తు ఎంతకైనా తెగిస్తుంది. అది ఏపాటిది అనేది చూడదు. ఎంతటిదైనా క్లియర్ చేసేస్తుంది. మద్యం మత్తులో ఓ మహిళను కొట్టి సజీవంగా పూడ్చిపెట్టిన దారుణమైన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరంలో ఘోరం జరిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తనకున్న ఏడేళ్ల కుమార్తె మృతురాలి విషయం పెద్దలకు చెప్పడంతో.. విషయం తెలిసిందే. దీంతో  కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా కొడవలూరులోని గొట్లపాలెం గ్రామంలో పొన్నూరు సుభాషిణి అనే మహిళ సాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ ఘర్షణలో సాములు కర్రతో గట్టిగా కొట్టడంతో.. సుభాషిణి సృహ కోల్పోయింది. వెంటనే ఆమెను పొదల్లో గుంత తీసి పూడ్చిపెట్టి.. కూతురిని బెదిరించి పారిపోయాడు. ఆ తర్వాత మృతురాలి కుమార్తె రెండు రోజులకు విషయం బందువులకు చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాములు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.