బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ సెల్ ఫోన్ నంబర్ తో సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. రాత్రి పూట వివిధ వాట్సాప్ గ్రూప్ లలో ఫోర్న్ వీడియోలు హల్ చల్ చేశాయి. ఆ తరువాత వాటిని డిలీట్ చేశారట. ఫోర్న్ వీడియోలు వైరల్ కావడంపై తాజాగా బెల్లంపల్లి కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ స్పందించారు. గ్రూపులో నేను అశ్లీల మెసేజ్ లు పోస్ట్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వివరణ ఇచ్చారు.
నేను వాడేటటువంటి నా ఫోన్ నెంబర్ 90000 81819 అని… నేను ఏదైనా అత్యవసర మీటింగ్ లో పాల్గొన్న లేదా నేను వాడే మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిన సమయంలో నా కొరకు ఫోన్ చేసే ప్రజలు,కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా యొక్క సమాచారం తెలవడం కోసం మరొక ఫోన్ ను నా వాహనంలో ఉంచడం జరుగుతుందన్నారు వినోద్. అట్టి మొబైల్ ను నా వెహికల్ డ్రైవర్స్ నా సమాచారాన్ని వేరే వారికి తెలియ చెప్పడం కొరకు వాడుతుంటారని చెప్పారు. అందులో భాగంగా నిన్న రాత్రి నా డ్రైవర్ మొబైల్ వాడుతున్న సమయంలో అతడి తప్పిదం వల్ల వచ్చిన మెసేజ్ లే తప్పా .. వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు.