ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. యాప్ పేరు చెప్పి..ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొట్టేశాడు. తాజాగ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక దిలార్‌భాయ్ వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి స్వీట్ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ ఫోన్‌పే యాప్ గడువు తీరిందని.. వివరాలు తెలిపితే తిరిగి సరిచేస్తామని తెలిపారు. దాంతో ఏటీఎం కార్డు, పిన్ నంబర్ చెబితేనే ఫోన్‌పే పనిచేస్తుందని నమ్మించాడు. దీంతో మహబూబ్ బాషా తనకు ఆ నంబర్లన్నీ తెలియవని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ వ్యక్తి మహబూబ్ బాషా సెల్‌ఫోన్‌కు ఒక లింక్ పంపి ఫోన్ చేశాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీ ఫోన్‌పే పునరుద్ధరణ జరుగుతుందని అన్నాడు.