Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లండన్ లో భారీ ఉగ్రవాదకుట్రను పోలీసులు భగ్నం చేశారు. బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ గేట్లు పేల్చివేసి థెరెసా మే ను హతమార్చాలని ఉగ్రవాదులు ప్రణాళిక వేశారు. డౌనింగ్ స్ట్రీట్ గేట్లు పేల్చివేసి..భద్రతాసిబ్బంది ఆ గందరగోళంలో ఉండగా..భవనంలో ప్రవేశించి ప్రధానిని హతమార్చాలన్నది ఉగ్రవాదుల ప్లాన్. అయితే ఆ ప్లాన్ ను పోలీసులు భగ్నం చేసి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిని ఉత్తర లండన్ కు చెందిన 20 ఏళ్ల రెహ్మాన్, బర్మింగ్ హామ్ కు చెందిన 21 ఏళ్ల ఇమ్రాన్ లుగా గుర్తించారు.
నవంబర్ 28న కౌంటర్ టెర్రర్ కమాండ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యూకే మెట్రోపాలిటిన్ పోలీసులు ఉగ్ర పథకాన్ని వెల్లడించారు. నిందితులను వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ అనేక మార్లు ఉగ్రవాదులు థెరెసా మే ను చంపడానికి ప్రణాళికలు వేశారు. గత ఏడాడి కాలంలో ఇలా ఉగ్రవాదులు వేసిన ప్రణాళికలను బ్రిటన్ పోలీసులు 9 సార్లు తిప్పికొట్టారని థెరిసా ప్రతినిధి వెల్లడించారు.