Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నోట్ల రద్దు జరిగినా ఆశించినంతగా నల్లధనం బయటకు రాలేదని భావిస్తున్న మోడీ.. భారత్ పర్యటనకు వచ్చిన స్విస్ అధ్యక్షురాలు డోరిస్ ల్యూథర్డ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. అక్రమార్కుల ఆట కట్టించడానికి కొన్ని రహస్య ఒప్పందాలు కూడా ఉండాలని ఇరువురు నేతలు భావించినట్లు సమాచారం. దీంతో మరోసారి అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
2019 ఎన్నికలకు ముందు ఏదో అద్భుతం చేయాలని మోడీ అనుకుంటున్నారు. ఉరీ ఉగ్రదాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో దేశప్రజలకు తీయని షాక్ ఇవ్వాలని చూస్తున్నారు.డోక్లాంలో చైనాతో యుద్ధం చేస్తారని అనుకున్నా.. డ్రాగన్ తోక ముడవడంతో ఆ ఛాన్స్ పోయింది. ఇప్పుడు ఉన్నట్లుండి స్విస్ అకౌంట్లన్నీ జప్తు చేస్తారేమోనని ఊహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే అక్కడ ఉన్న నల్లడబ్బు అఫిషియల్ గా ప్రభుత్వ ధనంగా మారిపోతుంది. ఎన్నికల ముందు జిమ్మిక్కుల్లో భాగంగా తమకు ఎసరు తెస్తారని ముందే ఊహించిన బ్లాక్ మనీ మాఫియా.. తమ అకౌంట్లను స్విస్ నుంచి గుర్తుతెలియని దేశాలకు ఎప్పుడో తరలించింది. అందుకే గతంలో స్విస్ బ్యాంకులు తమ దగ్గర ఇండియన్ల డిపాజిట్లు తగ్గుతున్నాయని ప్రకటించింది. కానీ మోడీ మాత్రం ఇంకా స్విస్ బ్యాంకునే పట్టుకుని వేలాడితే నల్లధనం బయటకు రాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ మనీకి ఛాన్స్ ఉండే ఆర్థిక వ్యవస్థలన్నింటిపై నిఘా పెట్టాలని సూచిస్తున్నారు.
మరిన్ని వార్తలు: