కొత్త నోట్లు హైదరాబాద్ రావా..?

new Rs 200 and Rs 50 notes will daspatch hyderabad or not

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డీమానిటైజేషన్ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. కానీ హైదరాబాద్ పై ఉండే ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అప్పుడూ కొత్త నోట్లు మనకు అంత త్వరగా రాలేదు. కానీ ఇప్పుడు కూడా కొత్త నోట్లు ఇంకా మార్కెట్ లోకి రాలేదు. 200, 50 రూపాయల నోట్లు కూడా ఇంకా హైదరాబాద్ చేరుకోలేదు. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ కావడం హైదరాబాదీల్ని ఆశ్చర్యపరుస్తోంది.

200 రూపాయల నోటు రిలీజ్ రోజే నార్త్ స్టేట్స్ లో ప్రత్యక్షం కాగా.. హైదరాబాద్ ఎందుకు రాలేదనే విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. దక్షిణాది రాష్ట్రాలు నిజంగా ఆర్బీఐ దృష్టిలో తక్కువా అనే విషయం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా లాంటి మెట్రోసిటీల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయని. మిగతా రాష్ట్రాలకు తర్వాత ఇస్తామని ఆర్బీఐ చెబుతోంది.

ఆర్బీఐ నిజంగా చెబుతుందా.. లేదంటే ఏదైనా ఉద్దేశంతో ఈ పనులు చేస్తోందాద అని జనం అనుమానిస్తున్నారు. డీమానిటైజేషన్ సమయంలో కూడా సీఎం కేసీఆర్ సీరియస్ అయితే కానీ ఆర్బీఐ నోట్లు పంపలేదు. ఇప్పుడు కూడా తీవ్ర నిరసన రావాలని కోరుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే.. తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలని డిసైడైనట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

సింగ‌పూర్ అధ్య‌క్షుడిగా భార‌త సంత‌తి వ్య‌క్తి…

బ‌త‌కాలని లేదంటున్న గుర్మీత్

ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ