మోడీ నెత్తిన బొప్పి కట్టిస్తున్న సీఎం

Modi Summons Tripura CM Biplab Deb Over Controversial Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాప్ ఏక్ నంబరీ… బేటా దస్ నంబరీ… ఆవు చేలో మేస్తే… దూడ గట్టున మేస్తుందా? లాంటి సామెతలు వీరికోసమే పుట్టాయా అనిపిస్త్తుంది. అలాగే ఉంది చూడబోతే ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు గాక మేయదు. తండ్రి ఒక తప్పు చేసి అది తప్పు కాదని అనుకుంటే కొడుకు అలాంటి తప్పులే పది సార్లు చేస్తాడు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. యువత ఖాళీగా ఉండకుండా పకోడీలు అమ్ముకుంటే బాగా సంపాదించవచ్చునని సాక్షాత్తూ ప్రధానమంత్రి మోడీ దిశా నిర్దేశం చేస్తోంటే మేమేం తక్కువ తిన్నామా అంటూ బెజేపీ ముఖ్యమంత్రులు కూడా ఆవులపెంచుకోండి, కిళ్లీ కొట్లు పెట్టుకోండి అంటూ సెలవిస్తున్నారు.

నాయకులు రెండు రకాలు. మొదటి రకం ఎన్నో ప్రజా రంజక సేవలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పది గుర్తింపు పొందటం. మరో రకం ఎలాంటి కష్టాలు పడకుండా రెండు మూడు సంచలన వ్యాఖ్యలతో అందరి ద్రుష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు ఈ రెండో జాబితాలో త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ వర్మ చేరుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఓవైపు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా… సోషల్‌ మీడియాలో విప్లవ్‌, బీజేపీలను విపరీతంగా ట్రోల్‌ చేసేస్తున్నారు.

మహాభారత కాలంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ ఉందంటూ మొదలైన ఆయన అజ్ఞాన వ్యాఖ్యల వ్యవహారం… పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ మరో సారి… మాజీ మిస్‌ వరల్డ్‌ డయానా హెడెన్‌ పై అభ్యంతరకర వ్యాఖ్యలు… సివిల్‌ సర్వీసెస్‌కు సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్‌ వాళ్లు పనికి రారని ప్రకటన… చివరకు.. చదువుకోవటం కన్నా పాన్‌ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుస తన వ్యవహార శైలితో ఆయన మీడియాలో రోజు నిలుస్తున్నారు. విప్లవ్ వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి చేటు తెచ్చేలా ఉండడంతో మే 2న తన ఎదుట హాజరై విచారణ ఇవ్వాలని ప్రధాని ఆదేశించినట్లు పీఎంవో కార్యాలయం సమన్లు జారీ చేసింది. అసలు అలాంటి వ్యక్తి సీఎం అవడమేమిటా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.