
రెండేళ్లుగా కోర్టు కేసుల్లో నానుతున్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు మొండి వైఖరిని అత్యున్నత ధర్మాసనం తప్పుబట్టింది. అది దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.. అయితే ఇప్పటికే పూర్తైన 15,474 మంది అభ్యర్థుల నియామకాలను డిస్టర్బ్ చేయకుండా మిగిలిన 854 పోస్టుల నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ ఎస్‌ఎల్‌పీని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.