తుక్కుగూడలో కాంగ్రెస్‌ సభకు పోలీసులు గ్రీన్‌ సిగ్నల్‌.. కానీ..

Police gave green signal to Congress House in Tukkuguda.. But..
Police gave green signal to Congress House in Tukkuguda.. But..

ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భారీ బహిరంగా సభను నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ భారీ బహిరంగా సభను తుక్కుగూడలో నిర్వహించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తుక్కుగూడలో ఈ నెల 17వ తేదీన తలపెట్టిన విజయభేరి బహిరంగ సభకు తాజాగా రాచకొండ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ 25 నిబంధనలతో కాంగ్రెస్ సభకు అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ సభకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటలకు వరకు పర్మిషన్ ఇచ్చారు. ఈ సభలో పదివేల మందికి మించకూడదని పోలీసులు నిబంధన విధించారు. ఓ పక్కా కాంగ్రెస్ విజయభేరి సభను లక్షల మందితో నిర్వహిస్తామని చెబుతుండగా.. 10 వేల మందికే పోలీసులు మాత్రం పర్మిషన్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

అయితే.. నగర శివారులో వంద ఎకరాలకు పైగా ఖాళీ స్థలంలో నిర్వహించనున్న ఈ సభకు… భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. మూడు రోజులపాటు నియోజకవర్గాల వారీగా స్థానిక నాయకత్వంతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశాలు నిర్వహించి పోలింగ్‌ కేంద్రాల వారీగా.. పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇవాళ, రేపు కూడా నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించనున్న ఏఐసీసీ పరిశీలకులు.. స్థానిక నాయకుల సహకారంతో ఎంత మంది సభకు తరలివస్తారన్న దానిపై పీసీసీకి నివేదిక ఇస్తారు. అయితే హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు.