Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అన్నిరకాలుగా సపోర్ట్ చేసే సీఎం, ఏం కావాలన్నా ఇచ్చే ప్రభుత్వం ఉన్నా కూడా.. తెలంగాణ పోలీసులకు ఆత్మస్థైర్యం సరిపోవడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ జరుగుతున్న వరుస ఆత్మహత్యలు పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి. ప్రజలను రక్షించడానికి ఇచ్చిన తుపాకీతోనే తమ ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారనేది మిస్టరీగా మారుతోంది.
కరీంనగర్ ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ చంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. మానసిక ఆందోళనో చనిపోయాడు. తన తుపాకీతోనే కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడని అధికారులు తేల్చారు. కానీ తెలంగాణ పోలీసులే ఎందుకు వరుసగా ఇలాంటి మరణాలకు పాల్పడుతున్నారనేది ఎవరికీ అంతుబట్టడం.
గతంలో ఇద్దరు ఎస్సైలు చనిపోయినప్పుడు ఇలాగే.. ఉన్నతాధికారుల వేధింపుల కోణాన్ని పక్కనపెట్టి.. వ్యక్తిగత కారణాలతోనే చనిపోయారని తేల్చేశారు అధికారులు. ఇప్పుడు కానిస్టేబుల్ మరణాన్ని అలాగే చూపిస్తున్నారు. ఇంత త్వరగా కేసులు క్లోజ్ చేస్తున్న అధికారులు ఏదో దాస్తున్నారని అందరికీ అనుమానాలొస్తున్నాయి.