Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయత్రకి ప్రయత్నించారు. అయితే ఎప్పటిలాగానే ఇంటి నుంచి బయటికి రాగానే ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను పాదయత్రకి అయినా అనుమతించాలని లేదంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ విషయం తేల్చి చెప్పాలని ముద్రగడ పోలీసులకి డెడ్ లైన్ పెట్టారు.
ఆ తర్వాత పోలీసుల వైఖరికి నిరసనగా ముద్రగడ సహా ఆయన ఇంటికి వచ్చిన కాపు నాయకులు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపారు. అయితే ముద్రగడ వాదనను పోలీస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. కొన్నాళ్లుగా ముద్రగడ పాదయత్రని అడ్డుకోడానికి కారణం ఆయన అందుకు అనుమతి తీసుకోకపోవడమే అని చెబుతున్నారు. ఐపీసీ సెక్షన్ 30 , సెక్షన్ 144 అమల్లో ఉన్నందున పాదయత్రకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నట్టు ఖాకీలు అంటున్నారు. అటు ముద్రగడ సైతం పాదయాత్ర అనుమతి కోసం కోర్టుకి వెళ్లే ఉద్దేశం లేదంటున్నారు. అంటే వీలైనంత ఎక్కువగా ఈ సమస్యని కొనసాగించడానికే ముద్రగడ మొగ్గుజూపుతున్నారు. కానీ ప్రభుత్వం నిరవధికంగా ఆయన ఇంటి ముందు ఈ స్థాయిలో పోలీసుల్ని మోహరించగలదు?
మరిన్ని వార్తలు: