హీరోయిన్‌ డ్రగ్స్‌ బిజినెస్‌

polices-arrest-to-mamta-kul

బాలీవుడ్‌లో 1990లలో కుర్రకారును ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ మమత కులకర్ణి గత కొంత కాలంగా అవకాశాలు లేక సినిమాలకు దూరం అయ్యింది. పెళ్లి చేసుకున్న మమత కులకర్ణి జీవిత భాగస్వామితో సంసార జీవితాన్ని సాఫీగా సాగిస్తుందని భావిస్తున్న సమయంలో అందరికి షాక్‌ ఇస్తూ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యింది. ముంబయి పోలీసులు పక్కా ఆధారాలతో మమత కులకర్ణిని అరెస్ట్‌ చేయడం జరిగింది.

ముంబయి శివారు ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం దాదాపు రెండు వేల కోట్ల డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ డ్రగ్స్‌కు సంబంధించిన కేసు ఎంక్వౌరీ చేస్తున్న సమయంలోనే మమత కులకర్ణి మరియు ఆమె భర్తకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా వెళ్లడైంది. విదేశాల నుండి డ్రగ్స్‌ను ఇండియాకు తరలించి, ముంబయిలోని పలువురు మద్యవర్తులు మరియు బాలీవుడ్‌ ప్రముఖుల సాయంతో కోట్లలో బిజినెస్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో మమత కులకర్ణి ఇలా మారిందని, జల్సాల కోసం డబ్బును పూర్తిగా పోగొట్టుకున్న ఆమెకు డ్రగ్స్‌ బిజినెస్‌ మార్గం అయ్యిందని ముంబయి పోలీసులు చెబుతున్నారు.