Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ. మైదానంలో భారీ జన సందోహం నడుమ రెండు జట్లు తలపడుతున్నాయి. ఆట ఏదైనా మైదానంలో ఉన్నంత సేపు లోపల ఆడేవాళ్లు, ఏదైనా విరామం దొరికినప్పుడు కోచ్ లేదా వ్యూహకర్తలు సలహాలు ఇస్తారు. కానీ మైదానంలో ఆడేటప్పుడు, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కూడా కోచ్ సపోర్ట్, సలహా ఉండాలనుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా ?. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అలాగే వుంది. జగన్ పాదయాత్ర లో నాయకులు, జనం, అధినేత జగన్ కన్నా స్పెషల్ గా డ్రెస్ చేసుకుని టీవీల్లో దర్శనం ఇస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం మీద ఎక్కువ చర్చ సాగుతోంది. ఏదైనా కొత్తగా కనిపిస్తుంటే కళ్ళు, మనసు తెలియకుండానే అటు లాగేస్తాయి. దీంతో జరిగేది నష్టమా,లాభమా అన్నది పక్కనబెడితే ప్రశాంత్ టీం జగన్ టూర్ లో స్థానిక నాయకులతో వ్యవహరిస్తున్న తీరు పట్ల వైసీపీ శ్రేణులు ఏ మాత్రం సంతృప్తిగా లేవు. స్థానిక పరిస్థితులు, రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు తమ మాటలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న బాధ వారిలో కనిపిస్తోంది.
జగన్ పాదయాత్ర జరిగిన ఈ 10 రోజుల్లోనే వైసీపీ టీం, స్థానిక నాయకత్వం మధ్య విభేదాలు తలెత్తాయట. అయితే జగన్ మాత్రం సమస్య లోతుల్లోకి వెళ్లకుండా పీకే టీం చెప్పినట్టు చేయమనే ఓ చిన్న మాటతో అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఈ విషయం ఎవరికి చెప్పాలో కూడా స్థానిక నాయకులకు అర్ధం కావడం లేదు. నిజంగా స్థానికులు ఇచ్చే సూచనలు, సలహాల్లో స్వీయ ప్రయోజనాలు ఉంటాయన్న అనుమానంతో జగన్ వారికి సపోర్ట్ చేయడం లేదని తెలుస్తోంది. కానీ ఇదే విషయాన్ని జగన్ గానీ పీకే బృందం కానీ కాస్త సామరస్యపూర్వకంగా చెప్పొచ్చు. స్థానిక నాయకత్వాన్ని గౌరవించవచ్చు. అది జరక్కపోవడంతోనే సమస్యంతా. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద పర్వతారోహకుడు అయినా స్థానిక షెర్పా ల సాయం తీసుకోవాల్సిందే. ఆ బేసిక్ పాయింట్ మిస్ అయితే మొత్తం కథ తిరగబడుతుంది. జగన్ కాస్త ఈ మాట విను అని వైసీపీ శ్రేణులే కోరుకుంటున్నాయి.