Political Updates: తెలంగాణ విద్యుత్‌ శాఖలో మొత్తం అప్పు 81,516 కోట్లు: డిప్యూటీ సీఎం

Political Updates: Total debt in Telangana Power Department is 81,516 crores: Deputy CM
Political Updates: Total debt in Telangana Power Department is 81,516 crores: Deputy CM

తెలంగాణ విద్యుత్‌ శాఖలో మొత్తం అప్పు 81,516 కోట్లు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసి లఘు చర్చను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముక. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే మొత్తంగా చూస్తే, ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండడం తెలంగాణ రాష్ట్ర మనుగడకు చాలా అవసరం అన్నారు భట్టి.