Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కత్తి మహేష్ కామెంట్స్ తో పూనమ్ కౌర్ బాగా హర్ట్ అయ్యింది. కత్తి కామెంట్స్ తో దెబ్బ తిన్న గౌరవ,ప్రతిష్టల్ని కాపాడేందుకు ముందుకు రావాలని ఆమె సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా పవన్ కి విజ్ఞప్తి చేశారు. పూనమ్ చేసిన ట్వీట్ ఇలా వుంది.
“ పవన్ స్పందిస్తే నా కెరీర్, నా కుటుంబాన్ని, నా మర్యాదని కాపాడిన వారు అవుతారు. కొందరు ( కత్తి మహేష్ ) రహస్య అజెండా పెట్టుకుని మాట్లాడుతున్నారు. నేను రాజకీయంగా టార్గెట్ కాదల్చుకోలేదు. ఇదే విషయం మీద స్వయంగా వచ్చి మీతో మాట్లాడతా “ అని ట్వీట్ చేసిన పూనమ్ కౌర్ కొద్దిసేపటికే దాన్ని డిలిట్ చేసింది. ఇలా పూనమ్ కౌర్ అంతలోనే ట్వీట్ డిలిట్ చేయడానికి కారణం ఏమిటో తెలియడం లేదు.