టాలీవుడ్ సినీ పరిశ్రమలో అన్నదమ్ములకు కేరాఫ్ అడ్రస్ గా చిరంజీవి సోదరులు అని చెప్పవచ్చు. చిరంజీవి మాటని జవదాటని తమ్ముళ్లుగా నాగబాబు, పవన్ కళ్యాణ్ పరిశ్రమలో మంచి పేరు దక్కించుకున్నారు. అలాంటి వీళ్లు, ఒకానొక సమయంలో చిరంజీవికే పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలిచారట.
వివరాల్లోకి వెళ్తే .. చిన్నప్పటినుండి పవన్ కళ్యాణ్ కి అటు చదువు మీద, ఇటు సినిమాల మీద ఆశక్తి పెద్దగా ఉండేది కాదు. ఎప్పుడూ కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలి .. వ్యవసాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడట.
కానీ చిరంజీవి హీరో అయ్యాక తన తమ్ముడిని కూడా ఎలాగైనా సరే హీరో చేయాలని భావించి,పవన్ కళ్యాణ్ కోసం కథలు వెతుకుతున్న సమయంలోనే ఎంతో మంది దర్శకులు చిరంజీవికి కథలు చెప్పారు. కానీ ఏ కథ కూడా ఆయనకు నచ్చలేదు.
అలా కథలన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ కి ఒకరోజు కోపం వచ్చి అసలు ఏంటన్నయ్య నా పరిస్థితి.. ఇలా ఎన్ని రోజులు కథలు రిజెక్ట్ చేసుకుంటూ నేను ఇలా తిరగాలి.. తప్పని సినిమాలు నేను చేయకపోయినా పర్లేదు.. నాకు హీరోగా చేయాలన్న కోరిక కూడా లేదు.. నేను సన్యాసం తీసుకుని బౌద్ధమతంలోకి వెళ్తాను అంటూ చెప్పాడట.
అన్నట్టుగానే మరుసటి రోజు మద్రాస్ కు పవన్ కళ్యాణ్ పారిపోయాడు .. విషయం తెలుసుకున్న చిరంజీవి తమ్ముడు ఎక్కడ ఉన్నాడో వెతికించి మరీ ఒక ఇంట్లో బంధించారు. బయటికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టి నాగబాబును కాపలాగా ఉంచారట. ఇక తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ కి చిరంజీవి పరిచయం చేశారు.