Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా… కాంగ్రెస్ కూడా ఆధిక్యం సాధించలేకపోతే ఆ పరిస్థితులు లో‘సంకీర్ణ సర్కారు’ తప్పని పరిస్థితే తలెత్తితే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రధాని అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ ఉండనున్నారని వార్తలు వస్తున్న తరుణంలో సొంత పార్టీ కాంగ్రెసే ఆయనకు షాకిచ్చినట్లు సమాచారం.కాంగ్రెస్ నేత అయి ఉండీ ఆరెస్సెస్ సభకి హాజరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ షాకిచ్చింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్ కి ఆహ్వానం అందలేదు. నాగపూర్ లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరైన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి హాజరుకావద్దంటూ ప్రణబ్ కూతురు సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు సూచించారు. అయినప్పటికీ ప్రణబ్ హాజరయ్యారు. దీంతో రెండేళ్ళ తర్వాత కాంగ్రెస్ ఇస్తున్న విందులో ఆయన పేరు లేపేసింది. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఇవ్వనున్న ఇఫ్తార్ విందు కోసం ప్రముఖుల పేర్లతో జాబితా రెడీ అయింది. అయితే, అందులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లు మాయమవడం ఇప్పుడు సంచలనమైంది. అలాగే, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పేరు కూడా కనిపించడం లేదు.