జగన్ కి సౌండ్ పొల్యూషన్ పడదంట.

Prasanth Kishore Warns Jagan on Roja,Chevy Reddy, Ambati Speaches

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వైసీపీ అధినేత జగన్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే సౌండ్ పొల్యూషన్ ఏ మాత్రం పడటం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ సౌండ్ ఎక్కువైతే నష్టం తప్ప లాభం లేదని తేల్చేయడంతో ఆ పొల్యూషన్ నుంచి తప్పించుకోడానికి జగన్ సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. అసలు ఈ సౌండ్ పొల్యూషన్ ఏంటి? సోషల్ మీడియా ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం ఏంటని అయోమయంలోకి వెళ్తున్నారా? ఆ అవసరం ఏమీ లేదు. ఇదంతా సింపుల్ మ్యాటర్.

ఒకప్పుడు వైసీపీ తరపున మీడియా మైక్ ల ముందు ఎక్కువగా కనిపించేవి నాలుగైదు మొహాలు… చెవుల్లో తుప్పు వదిలేలా వినిపించేవి వారి గొంతులు. ఆ జాబితాలో ఏ పేర్లు వుంటాయో అందరికీ తెలిసిందే. రోజా, చెవిరెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ వైసీపీ వాదనను బలంగా వినిపించేవాళ్ళు. అయితే ఆ సాకుతో వాళ్ళు ఉపయోగించే భాష, వారికి వ్యక్తిగతంగా వున్న ఇమేజ్ వల్ల పార్టీకి చేటు జరుగుతోందని ఓ సర్వే ద్వారా తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. ఇదే విషయాన్ని జగన్ చెవిన వేసి ఈ సౌండ్ పొల్యూషన్ తగ్గించకపోతే మున్ముందు కూడా పార్టీకి ఇబ్బందే అని చెప్పేసారు. దీంతో వారికి నేరుగా విషయం చెప్పకుండా వైసీపీ అనుకూల సోషల్ మీడియాలోనే ఈ బ్యాచ్ కి జగన్ క్లాస్ పీకినట్టు లీకులు వదిలారు. దీంతో గత పదిపదిహేను రోజులుగా ఒక్క అంబటి మినహా మిగతా గొంతులు కాస్త సౌండ్ తగ్గించాయి. అయితే ఈ సైలెన్స్ టెంపరరీ అనేవాళ్ళు కూడా కొందరున్నారు. చెవిరెడ్డి రిమాండ్ లో ఉండటం తో సౌండ్ లేదు గానీ ఆయన వస్తేనా అని జబ్బలు చరుస్తున్నవాళ్ళు కూడా లేకపోలేదు.

అయితే ఇకపై వీరి ఆశలు తీరేట్టు కనిపించడం లేదు. పార్టీ లో సౌండ్ పొల్యూషన్ కి కారణం అవుతున్నవాళ్ళకి ప్రత్యామ్న్యాయం వెతికే పనిలో పడ్డారు. ఎదుటి వాళ్ళు ఎంతటివారైనా కంచుకంఠం తో నిలదీసే వాసిరెడ్డి పద్మ ఉన్నప్పటికీ టీడీపీ ఎంపీ శివప్రసాద్ సోదరి పద్మజ ని పార్టీ లో అధికార ప్రతినిధిని చేయడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. 2014 కి ముందు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వున్న పద్మజ ఈ మధ్యే వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వెంటనే జగన్ ఆమెని అధికార ప్రతినిధిగా నియమించడం చూస్తుంటే వైసీపీ లో సౌండ్ పొల్యూషన్ కి చోటు లేనట్టే అనిపిస్తోంది. అయితే ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు:

కేటీఆర్ కి పాత మిత్రుడి లేఖ.

రీష కేసులో భర్త ప్రశ్నకు సమాధానమేంటి..?