Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలు, సినిమాలు మాత్రమే కాదు ఎన్నికల వ్యూహకర్తల భవిష్యత్ ని కూడా నిర్ణయించేది సక్సెస్ లేదా ఫెయిల్యూర్ మాత్రమే. 2014 ఎన్నికల తర్వాత మోడీ విజయంలో కీలక పాత్రధారిగా ఓ వెలుగు వెలిగిన ప్రశాంత్ కిషోర్ కి మూడేళ్లు గడిచేసరికి అవకాశాలు లేకుండా పోయాయి. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దికాలానికే ప్రశాంత్ కిషోర్ ని బీజేపీ పక్కనబెట్టింది. అంత భారీ విజయం తర్వాత కూడా ప్రశాంత్ ని బీజేపీ సైడ్ చేయడం వెనుక కారణాలు ఏమిటో ఇప్పటికీ బయటికి రాలేదు. అయితే ఆ తర్వాత బీహార్ లో మహాకూటమి ఏర్పాటుతో బీజేపీ ని కంగుతినిపించి ప్రశాంత్ కమలనాథులకు షాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ కి ఒక్కసారిగా డిమాండ్ అయితే పెరిగింది గానీ ఒక్క విజయం కూడా దక్కలేదు.
బీహార్ విజయం తర్వాత ప్రశాంత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అతనికి యూపీ ఎన్నికల్లో పెద్ద పీట వేసింది కాంగ్రెస్. ప్రశాంత్ మీద నమ్మకంతో అతను ఏమి చేయమంటే అది చేసింది. కొందరు నాయకుల్ని కూడా పక్కనబెట్టింది. అయితే అక్కడ పూర్ రిజల్ట్ తో 2019 ఎన్నికలదాకా అతన్నే నమ్ముకోవాలి అనుకున్న కాంగ్రెస్ ఆలోచన మారిపోయింది. ప్రశాంత్ ని పక్కనబెట్టేసింది. ఆ టైం లో ఒక్క జగన్ మాత్రమే ప్రశాంత్ ని నమ్మి అతనికి ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యూహానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. ఎప్పుడైతే ప్రశాంత్ టీం ఆంధ్రా వచ్చాడో అతనికి ఇంతవరకు ఆయన్ని ఇంకో పార్టీ పిలిచింది లేదు. పైగా నంద్యాల,కాకినాడ ఫలితాలు చూసాక ప్రశాంత్ ఏదో మేజిక్ చేస్తాడన్న నమ్మకం వైసీపీ శ్రేణుల్లోనే లేదు. ఇక టీడీపీ మీద సోషల్ మీడియా లో ఈశాన్య రాష్ట్రాల కి సంబంధించిన పేర్లు పెట్టుకుని ప్రశాంత్ టీం చేసిన విమర్శలు నవ్వుల పాలయ్యాయి. ఏ రకంగా చూసినా ప్రస్తుతం ప్రశాంత్ అవుట్ డేటెడ్ అనిపిస్తున్నాడు రాజకీయ పార్టీలకి. ఈ పరిస్థితి చూసి జగన్ అయినా 2019 దాకా ప్రశాంత్ ని భరిస్తాడో లేక గుడ్ బై కొడతాడో.