Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా వుండబోతోంది?. ఈ ప్రశ్నకు సమాధానం కోసం నంద్యాల, కాకినాడ ఫలితాలు వచ్చాక వైసీపీ ఓ రహస్య సర్వే నిర్వహించిందట. వచ్చే ఏడాది డిసెంబర్ లోనే ఎన్నికలు జరగవచ్చని సంకేతాలు రావడంతో వైసీపీ తరపున ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ సర్వేతో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయట. 2014 లో వైసీపీ కి షాక్ ఇచ్చిన కోస్తా లో ఈసారి అంతకు మించిన పరాభవం జరిగే అవకాశం ఉందట.
కోస్తాఆంధ్రలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. వాటిలో 2014 లో టీడీపీ 59 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత వైసీపీ లో గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు అధికార పార్టీలో చేరడంతో టీడీపీ బలం 68 కి చేరింది. 2018 డిసెంబర్ లో గనుక ఎన్నికలు జరిగితే టీడీపీ 72 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందట. ఇక కోస్తాలో మిగిలేది 17 స్థానాలు. వాటిలో వైసీపీ 10 , జనసేన 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు చెప్పడంతో వైసీపీ హైకమాండ్ తీవ్ర నిరాశలో మునిగిపోయిందట. జిల్లాల వారీగా ఈ సర్వే లో వెల్లడైన ఫలితాలు ఇలా వున్నాయి.
1 . తూర్పు గోదావరిలో 19 స్థానాలకు గాను టీడీపీ 14 , వైసీపీ 2 , జనసేన 3 స్థానాలు గెలుస్తాయట.
2 . పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను టీడీపీ 12 , వైసీపీ 1 , జనసేన 2 చోట్ల గెలుస్తాయట .
3 . కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను టీడీపీ 14 , వైసీపీ 1 , జనసేన 1 చోట విజయం సాధిస్తాయట.
4 . గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గాను టీడీపీ 15 , వైసీపీ 2 స్థానాలు గెలుస్తాయట.
5 . ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను టీడీపీ 9 , వైసీపీ 2 , జనసేన 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందట.
6 . నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు గాను టీడీపీ 8 , వైసీపీ రెండు చోట్ల గెలుస్తాయట.
కోస్తా ఆంధ్రాలో వైసీపీ కి ఇంత ఘోరమైన ఫలితాలు రావడానికి ప్రధాన కారణాలు ఇవేనట.
అమరావతిని రాజధానిగా వైసీపీ వ్యతిరేకిస్తుందని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉందట. ఇదే గాకుండా పట్టిసీమ ద్వారా వస్తున్న నీళ్లతో ఈ జిల్లాల్లో పండుతున్న పంటలు కూడా రైతుల్లో ప్రభుత్వ సానుకూలతకు దారి చూపిందట.
మరిన్ని వార్తలు: