Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ ప్రధాని బీజేపీ కురువృద్దుడు అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఈరోజు స్వప్ల అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావటంతో ఎయిమ్స్‌కు తరలించారు. ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ఆందోళన చెందాయి. అయితే రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన్ని ఎయిమ్స్‌కు తరలించినట్లు ఆయన కార్యదర్శి మహేంద్ర పాండే ఓ ప్రెస్ నోట్ మీడియాకు విడుదల చేశారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేతృత్వంలోని బృందం వాజ్‌పేయికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. గఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్‌గా ఉన్న వాజ్‌పేయి.. భారత దేశానికి పదవ ప్రధానిగా పనిచేశారు. కాంగ్రెసేతర ప్రధానిగా దేశాన్ని ఐదేళ్లు పాలించిన ఘనత కూడా వాజ్‌పేయిదే. వయసు మీద పడడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.