‘35’లో ప్రియదర్శి చాణక్య వర్మగా.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!

Chanakya Varma as Priyadarshi in '35'.. Glimpse Release!
Chanakya Varma as Priyadarshi in '35'.. Glimpse Release!

టాలీవుడ్‌లో తన అందంతో పాటు నటనతోనూ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ నివేదా థామస్, కొంచెం గ్యాప్ తరువాత నటిస్తున్న తాజా మూవీ ‘35 – చిన్న కథ కాదు’. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఇక ఈ మూవీ లో ఒక మధ్యతరగతి గృహిణి పాత్రలో నివేదా నటిస్తుండటంతో ఆమె అభిమానులు ఈ మూవీ ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

Chanakya Varma as Priyadarshi in '35'.. Glimpse Release!
Chanakya Varma as Priyadarshi in ’35’.. Glimpse Release!

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, వీడియో గ్లింప్స్‌లు ఈ మూవీ పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీ లో నటుడు ప్రియదర్శి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఆయన చాణక్య వర్మ అనే ఉపాధ్యాయుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆయన పాత్రకి సంబంధించి తాజాగా ఒక వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరోసారి ఆయన తన నటనతో ఈ మూవీ కు మేజర్ అసెట్‌గా మారనున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాను హీరో రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తుండగా, నంద కిషోర్ ఈమని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.