సందీప్ కిషన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రం తెలుగులో ‘ప్రాజెక్ట్ జడ్’ అనే పేరుతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తెలుగులో ‘ప్రాజెక్ట్ జడ్’ చిత్రాన్ని రిలీజ్ చేసిన నిర్మాత బషీద్‌కు తీవ్ర నష్టాలు వచ్చాయి. సినిమా విడుదల సమయంలో హీరో సందీప్ కిషన్ ప్రమోషన్‌కు సపోర్ట్ చేయకపోవడంతో పాటు, పలు సార్లు తనను ఇబ్బంది పెట్టాడు అంటూ సందీప్ కిషన్‌పై ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. సందీప్ కిషన్‌తో సినిమా చేయడం కంటే ఒక కుక్కను తీసుకుని సినిమా చేయడం ఉత్తమం అని, ఆయన ఒక హీరోలా ప్రవర్తించకుండా విలన్‌గా నాకు నా సినిమాకు మారాడు అంటూ బషీద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తమిళంలో సినిమాను విడుదల చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న నేపథ్యంలో తాను ఇక ఆగకుండా తెలుగులో విడుదల చేశాను అని, ఆ కోపంతో సినిమా ప్రమోషన్‌కు హాజరు కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రమోషన్ సరిగా చేయక పోవడం వల్లే పెట్టిన పెట్టుబడి రాలేదు అని, ఇలాంటి హీరో ఉంటే ఏ నిర్మాత అయినా అడుక్కోవాల్సిందే అంటూ బషీద్ ఆరోపణలు చేస్తున్నాడు. సందీప్ కిషన్‌పై పోలీసు కేసు పెట్టాలని కూడా భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మరో వైపు సందీప్ కిషన్‌కు అదే సినిమాకు చెందిన కొందరు మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి సందీప్ కిషన్‌పై బషీద్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.