Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయ్ హీరోగా నటించిన ‘మెర్సల్’ చిత్రం తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన జీఎస్టీ పన్ను విధానంపై ఈ చిత్రంలో కొన్ని డైలాగ్స్‌లు వివాదాస్పదం అవ్వడంతో తమిళ వర్షన్‌లో ఆ డైలాగ్స్‌ను తొలగించడం జరిగింది. తెలుగులో మాత్రం ఆ డైలాగ్స్‌తోనే సెన్సార్ చేయించారు. తెలుగులో ఆ డైలాగ్స్ ఉంటాయని ప్రేక్షకులు ఆశించారు. కాని డైలాగ్స్ లేకుండానే సినిమా మొదటి రోజు మరియు రెండవ రోజు కూడా ప్రసారం అయ్యింది. టెక్నికల్ సమస్య తలెత్తడం వల్ల ఆ డైలాగ్‌ను మొదటి రెండు రోజులు చేర్చలేక పోయామని, మూడవ రోజు అయిన నేటి నుండి ఆ డైలాగ్ సినిమాలో ఉంటుందని నిర్మాత శరత్ మరార్ చెప్పుకొచ్చాడు.
తమిళనాట పెద్ద వివాదాన్ని సృష్టించిన ఆ డైలాగ్స్ తెలుగులో కూడా ఖచ్చితంగా వివాదం అవుతాయని అంతా భావిస్తున్నారు. జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ నేటి నుండి సినిమా హాల్స్‌లో ప్రేక్షకులకు వినిపించే అవకాశం ఉంది. ఆ డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించి, ఆకట్టుకుంటాయో తెలియదు కాని, బీజేపీ నాయకులు మాత్రం ఆడైలాగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం ఖాయం అంటూ సమాచారం అందుతుంది.
తెలుగులో ఆ డైలాగ్స్ తెలగించాల్సిందే అంటూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టడం వల్ల రెండు రోజుల పాటు సినిమాకు భారీగా ఫ్రీ పబ్లిసిటీ దక్కే ఛాన్స్ ఉంది. దాంతో సినిమాకు మంచి కలెక్షన్స్ రానున్నాయి. ఇప్పటికే మొదటి రెండు రోజుల్లో ఏకంగా రెండు కోట్ల మేరకు కలెక్షన్స్‌ను సాధించినట్లుగా సమాచారం అందుతుంది.