Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. హాలీవుడ్ సినిమా స్థాయిలో సినిమాను రాజమౌళి తెరకెక్కించాడు. అద్బుతమైన సెట్టింగ్స్‌తో సినిమాను తీర్చి దిద్దాడు. సినిమాలో సెట్టింగ్స్ ఇంత అద్బుతంగా రావడంకు రామోజీరావుగారి సహకారం చాలా ఉందని పలు సందర్బాల్లో జక్కన్న చెప్పుకొచ్చాడు. నాకు ఏం కావాలో అది రామోజీ ఫిల్మ్ సిటీలో దొరికంది. అందుకే సినిమాను ఇంత బాగా తీయగలిగాను, ఒకవేళ రామోజీ ఫిల్మ్ సిటీ లేకుంటే బాహుబలి సాధ్యం అయ్యేది కాదేమో అంటూ జక్కన్న ప్రమోషన్ సమయంలో పలు సార్లు చెప్పుకొచ్చాడు. సినిమా విడుదల తర్వాత ఆయన వర్షన్ మారినట్లుగా అనిపిస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీకి ఇవ్వాల్సిన బాకీని జక్కన్న ఎగవేసే ప్రయత్నం చేస్తున్నాడని, రామోజీ రావును ఇబ్బంది పెడుతున్నాడు అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, ఇలాంటి వార్తలు పుట్టించవద్దంటూ నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చాడు. నిప్పులేనిదే పొగ రాదు అంటారు. రామోజీ, రాజమౌళిల మద్య విభేదాలు ఉన్న కారణంగానే ఇలా వార్తలు వస్తున్నాయని అంటున్నారు. అది నిజమేనేమో అన్నట్లుగా ప్రస్తుతం జక్కన్న తన తర్వాత సినిమా కోసం భారీ సెట్టింగ్స్‌ను అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేయిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని వసతులు ఉంచుకుని, అక్కడ బాహుబలి సమయంలో వాతావరణం అలవాటు అయిన జక్కన్న ఇప్పుడు తాను చేయబోతున్న మల్టీస్టారర్ సినిమాకు ఎందుకు రామోజీ ఫిల్మ్ సిటీని ఎంచుకోలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. రామోజీ రావుతో విభేదాలు నిజమే, అందుకే మల్టీస్టారర్ కోసం అల్యూమీనియం ఫ్యాక్టరీలో సెట్టింగ్స్ వేయిస్తున్నాడు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మరి దీనిపై నిర్మాత శోభు ఎలా స్పందిస్తాడో చూడాలి.