Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఎన్నికల్లో రాజకీయం వేడెక్కుతోంది. మంత్రి భూమా అఖిలప్రియ, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య చంద్రబాబే రాజీ కుదిర్చినా ఎవరూ ఆయన మాట వినిపించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే బాబు మాత్రం సీరియస్ గా తన వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. అందుకే విడివిడిగా అయినా ఇద్దరూ బ్రహ్మానందరెడ్డి కోసం ప్రచారం మాత్రం చేస్తున్నారు.
అయితే అఖిల, సుబ్బారెడ్డి కలిసిపోదామనుకుంటున్నా.. ఆస్తి గొడవలు వారిని కుదురుగా ఉండనివ్వడం లేదట. భూమా ఆస్తుల గురించి శోభా నాగిరెడ్డి కంటే కూడా సుబ్బారెడ్డికి ఎక్కువ తెలుసట. అయితే భూమా మరణం తర్వాత సుబ్బారెడ్డి ఆస్తుల గురించి సరైన వివరణ ఇవ్వలేదని అఖిల అసంతృప్తిగా ఉన్నారు. ఏ పెద్ద నేత చనిపోయినా ఇలాంటి విషయాలు కామనే. వాటి కోసం పార్టీని తాకట్టు పెడతారా అని క్యాడర్ మండిపడుతోంది.
భూమా సంపాదించిన చాలా ఆస్తులకు సుబ్బారెడ్డే బినామీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో సీన్ మారిపోయింది. సుబ్బారెడ్డి తమ ఆస్తులు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అఖిల వర్గం ఆరోపిస్తోంది. సీఎం కూడా సుబ్బారెడ్డికి తన కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తోందట. అయితే అఖిలకు దూకుడు ఉన్నా అనుభవం లేదు. రాజకీయాల్లో అనుభవమే తరగని ఆస్తి అనే విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదంటున్నారు సీనియర్లు.
మరిన్ని వార్తలు: