బెజవాడ పున్నమి ఘాట్ లో షాక్.. గోవులు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఘోరం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ లో మృతి చెంది ఉన్న గోవులు కనిపించడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతోనే గోవులు మరణించాయని అధికారులు వెల్లడించారు. వర్షాలు, గాలి కారణంగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయని.. దాంతో వాటిని ఎవరూ గమనించలేదని.. ఆ వైర్లు  వాటిని తాకడంతో ఆవులు చనిపోయాయని అధికారులు స్పష్టం చేశారు.

అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు మండిపడుతున్నారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తామని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పడంతో ఆందోళనకారులు తగ్గారు.