ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై మరోసారి స్పందించిన బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబుపై కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే అని.. విచారణ చేస్తున్నది సీఐడీ.. అసలు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఎక్కడ ఉంటుంది..? అని ప్రశ్నించారు. ఇక టీడీపీ, భారతీయ జనతా పార్టీ కలిస్తే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. జాతీయ పార్టీగా అధినాయకత్వం పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు .
మరోవైపు రాష్ట్రంలో మద్యం సహా ఇతర అక్రమాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తామని పురంధేశ్వరి ప్రకటించారు . మద్యం అక్రమాల మీద ఒక కమిటీని రాష్ట్రానికి పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు. మహిళా బిల్లును సాద్యం చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే అంటూ ప్రశంసలు కురిపించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ అధికారలుు ప్రశ్నిస్తున్నారు.. హైకోర్టు తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఇవాళ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు. సోమవారం దానిపై విచారణ జరుగే అవకాశం కనిపిస్తోంది.