విజయ్ దేవరకొండ తో నటించాలని వుందని ఒకసారి జాన్వీ కపూర్ చెప్పడంతో ఆ మాటని పట్టుకుని అతనితో తీసే సినిమాలో హీరోయిన్గా తనని ఎలాగైనా తెలుగు చిత్ర సీమకి తేవాలని పూరి జగన్నాథ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. తనకి వున్న బాలీవుడ్ కనక్షన్స్ అన్నీ వాడి బోనీ కపూర్‌ని ఒప్పించాలని చూస్తున్నాడు. శ్రీదేవి కూతురి తొలి సినిమా అంటే ఇక ఆ చిత్రానికి క్రేజ్ మామూలుగా వుండదు. అందుకే ఛార్మి కూడా తన వైపు నుంచి జాన్వీ డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఎలాగో దక్షిణాది చిత్రాల్లోను నటించడానికి సిద్ధమని జాన్వీ ఆమధ్య ప్రకటించడంతో ఆమెని ఒప్పించేస్తే ఈ చిత్రానికి పూర్తి హైప్ వచ్చేస్తుందనేది పూరీ ప్లాన్. అయితే జాన్వీ కపూర్‌కి హిందీలో చాలా కమిట్మెంట్స్ వున్నాయి. పూరి జగన్నాథ్ ఏ సినిమాని అయినా నాలుగైదు నెలలలో పూర్తి చేసేస్తాడు. అందుకోసం అతనికి హీరోయిన్ నుంచి బల్క్ డేట్స్ కావాలి. ఒకవేళ జాన్వీ అంగీకరిస్తే ఈ చిత్రం పూర్తి కావడానికి టైమ్ పడుతుంది. లేట్ అయినా ఫర్వాలేదు కానీ జాన్వీ ఒప్పుకుంటే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో తీసేయవచ్చునని పూరి పెద్ద ప్లాన్‌లోనే వున్నాడని తెలిసింది.