Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి ‘పైసా వసూల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. బాలయ్యకు 101వ సినిమా అయిన ఈ సినిమాను తనదైన శైలిలో విభిన్నంగా దర్శకుడు పూరి తెరకెక్కిస్తున్నాడు. సినిమా ప్రారంభం రోజే సెప్టెంబర్ చివర్లో ఈ సినిమాను విడుదల చేసి తీరుతాను అంటూ పూరి చెప్పుకొచ్చాడు. అన్నట్లుగా సినిమాను సెప్టెంబర్ 29న విడుదల చేయడం ఖాయం అని అంతా భావించారు. పూరి అన్నట్లుగా, అనుకున్న టైంకు సినిమాను తీసుకు వస్తాడని అంతా భావించారు. అయితే ఈసారి అందరికి షాక్ ఇస్తూ అనుకున్న సమయం కంటే ఏకంగా నెల రోజుల ముందు సినిమాను విడుదల చేయబోతున్నాడు.
టాలీవుడ్‌లో పూరి తప్ప దాదాపు అందరు దర్శకులు కూడా సినిమాను ఒక డేట్ అని చెప్పి మళ్లీ మళ్లీ విడుదల వాయిదా వేయడం చూశాం. సినిమా ప్రారంభం రోజే ఏ దర్శకుడు కూడా విడుదల తేదీని ప్రకటించలేడు. ఒక వేళ ప్రకటించినా ఆ తేదీకి వస్తుందనే నమ్మకం ఉండదు. కాని పూరి మాత్రం తాను చెప్పిన డేట్‌కు నెల రోజుల ముందే సినిమాను తీసుకు వస్తున్నాడు అంటే ఆయన స్థాయి, స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఏ స్టార్ దర్శకుడు కూడా ఇలా చెప్పిన టైం కంటే ముందే సినిమాను తీసుకు రాలేరు. బాలయ్య, శ్రియలు జంటగా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 29న కాకుండా సెప్టెంబర్ 1న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటుంది.
మరిన్ని వార్తలు: