Posted [reativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ సెలబ్రెటీలు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. సిట్ నుండి నోటీసులు అందుకున్న సెలబ్రెటీల్లో ఎంత మందికి ఆ కేసుతో సంబంధం ఉంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఎంత మంది డ్రగ్స్‌ను తీసుకుంటున్నారు అనే విషయంపై ఇంకా సిట్ కూడా త్చేలేదు. కాని కొన్ని మీడియా సంస్థలు మాత్రం వారు పూర్తిగా డ్రగ్స్‌కు అడిక్ట్ అయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే పూరి మాట్లాడుతూ నా కుటుంబ సభ్యులు నాలుగు రోజులుగా మీడియా కారణంగా ఏడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇతర సెలబ్రెటీలు అంతా కూడా మీడియా సంయమనం లేకుండా వ్యవహరిస్తుందంటూ ఆరోపణలు చేశారు.
తాజాగా ఎర్ర సినిమాలను తెరకెక్కించే ఆర్ నారాయణ మూర్తి కూడా మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. మీడియా డ్రగ్స్ కేసు విషయంలో అతి చేస్తుందని, సిట్ అధికారులు ఇంకా ఏం చెప్పకుండానే వారిని దోషులుగా చిత్రీకరిస్తూ ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని ఆయన అన్నాడు. మీడియా ఇటీవల కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మీడియా వల్ల సెలబ్రెటీల జీవితాలు నాశనం అవుతున్నాయని కొందరు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే మీడియా వల్ల వారు ప్రాచుర్యం పొందుతున్నారు అనే విషయాన్ని మాత్రం మర్చి పోతున్నారు.
మరిన్ని వార్తలు: