లాలూ ఫ్యామిలీకి ఊరట !

Rabri devi got bail

ఒక కేసుకు సంబంధించి బీహార్ మాజీ సీఎం లాలూ భార్య రబ్రీదేవికి, వారి కుమారుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఊరట లభించింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో వారిద్దరికి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా ఉన్న సమయంలో అంటే 2005లో రాంచీ, పూరీలో ఉన్న రెండు ఐఆర్సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్టు సీబీఐ చెబుతోంది. ఈమేరకు సీబీఐ వారి మీద చార్జ్ షీట్ దాఖలు చేసింది.

Rabri-devi

ఈ హోటల్ యజమానులు లాలూ కుటుంబానికి అత్యంత సన్నిహితులని ఆరోపిస్తూ ఆర్జేడీ అధినేత లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటూ రైల్వే అధికారులపై కూడా చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఈరోజు విచారణ జరగ్గా విచారణకు రబ్రీదేవి, తేజస్వీ యాదవ్‌లు హాజరయ్యారు. తర్వాత ఇరువర్గాల వదనాలు విన్న కోర్టు వారికి రూ.లక్ష పూచీకత్తు కింద బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన అధికారులకి కూడా బెయిల్ వచ్చింది. అలాగే ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది కోర్టు.

Rabri-devi