బేబీ మూవీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. బేబీ మూవీ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. అయితే ఈ మూవీ కస్టోరీని చెప్పేందుకు ఓ హీరో వద్దకు ప్రొడక్షన్ నుంచి కాల్ వెళ్తే దారుణంగా మాట్లాడాడట. హృదయ కాలేయం మూవీ డైరెక్టర్ అయితే స్టోరీ కూడా వినను అని అన్నాడట. దీంతో సాయి రాజేష్ ఫీల్ అయ్యాయడట. రాత్రి నిద్ర కూడా పోలేదని చెప్పుకొచ్చాడు సాయి రాజేష్.
ఆ హీరో ఎవరు అనే దానిపై చర్చలు నడుస్తోంటే.. ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ ఇప్పుడు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా విశ్వక్ సేన్ ఓ ట్వీట్ వేశాడు. అందులో నవ్వుతున్న ఎమోజీని మాత్రమే షేర్ చేశాడు. ఆ ట్వీట్, ఆ ఎమోజీ అర్థం ఏంటో తెలియక నెటిజన్లు జుట్టు పీక్కుంటూ ఉన్నారు. అంతలోపే మరో ట్వీట్ వేశాడు మన హీరో.
నో మీన్స్ నో.. అనేది మగాళ్లకి కూడా వర్తిస్తుంది.. అందుకే అంతా ప్రశాంతంగా, కూల్‌గా ఉండండి.. ప్రశాంతంతను పంచండి.. రిలాక్స్ అవ్వండి అంటూ అర్థం కాన్నట్టుగా ట్వీట్ వేశాడు. ఇందులో నో మీన్స్ నో అని ఎందుకు అన్నాడు? అసలేమై ఉంటుంది? ఎందుకు అలా ట్వీట్ వేశాడు? సినిమా ప్రాజెక్ట్ గురించా? లేకా విశ్వక్‌కి సైతం వేధింపులు వచ్చాయా?
అన్నది అర్థం కావడం లేదు.విశ్వక్ సేన్ , బేబీ మూవీకు నో చెప్పడం గురించే ఇలా ట్వీట్ వేసి ఉంటాడని అంటున్నారు. బేబీ మూవీకు నో చెప్పి మంచి పని చేశావ్ అంటున్నారు. అదో స్టోరీ.. అది నీకు సెట్ కాదు అన్న..నువ్వు చేయకపోవడమే మంచిది అంటూ విశ్వక్ సేన్‌కు మద్దతుగా ట్వీట్లు వేస్తున్నారు.
ఇక ఆయన ఇన్ స్టా స్టోరీని గమనిస్తే మాత్రం.. ఇంఫ్లూయెన్సర్లు, మోటివేషనల్ స్పీచులు ఇచ్చే వాళ్లు ఈనగరానికి ఏమైంది మూవీ మీద కాస్త ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. దాంతో వాళ్ల మీద ఏమైనా ట్వీట్ వేసి ఉంటాడా? అని మరి కొంత మంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నీ మాటలకు, చేతలకు పొంతన లేకపోతే నీకు విలువ ఉండదా అని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు విశ్వక్ సేన్. అయితే ఇవన్నీ చూస్తుంటే మాత్రం విశ్వక్ విషయంలో ఏదో జరిగినట్టు అర్థం అవుతోంది.