Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో ఉండగానే దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే జగన్ విధానాలు నచ్చక, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేక వంగవీటి రాధా వైసీపీ ని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఒక్క రాధతో ఆగే విషయం కాదట. కాపులకు రిజర్వేషన్స్ ఇస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం తో వైసీపీ లో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆత్మశోధనలో పడ్డారట . ఆ తర్వాత కాపుల మీద చిన్న చూపు చూస్తున్న జగన్ వైఖరి తో విసిగిపోయిన వాళ్ళు అదను చూసి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారట. ఇలాంటి నేతలందరితో వైసీపీ నుంచి అవమానం పొందిన వంగవీటి రాధా టచ్ లోకి వెళ్లారట. తాను ఒక్కడే కాకుండా వైసీపీ నుంచి మరికొందరు కాపు నేతల్ని టీడీపీ లోకి తీసుకెళ్లేందుకు రాధా స్కెచ్ వేసారట. అందుకు సానుకూల వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉన్నట్టు తెలుస్తోంది.
వైసీపీ కి షాక్ ఇస్తూ తమ పార్టీలోకి రావడానికి సిద్ధపడుతున్న వంగవీటి రాధకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఓకే అన్నట్టు తెలుస్తోంది. వంగవీటి కుటుంబాన్ని దక్షిణ కోస్తాలోని కాపులు ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆ ఫామిలీ వారసుడు రాధాని మంచి పదవితో గౌరవించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన వైసీపీ లోని కాపు నాయకులు టీడీపీ వైపు మొగ్గు జూపాలని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీ కి పెద్ద షాక్ కాబోతున్నాయి.