వివాహబంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.

వివాహబంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.
Latest News

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా వివాహ బంధంతో వీళ్లిద్దరు ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్​పుర్​లోని లీలా ప్యాలెస్​ లో వీరి పెళ్లి బంధానికి వేదికగా నిలిచింది. పంజాబీ సంప్రదాయంలో వీరి కల్యాణం ఆదివారం రోజున అంగరంగ వైభవంగా
కన్నులవిందుగా జరిగింది . బంధు మిత్రులు, స్నేహితుల సమక్షంలో రాఘవ్.. పరిణీతి మెడలో మూడు ముళ్లు కూడా వేశారు.

వివాహబంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.
Raghav-Parinethi

]ఈ వేడుకకు ఇరువురి తరఫున బంధువులు, స్నేహితులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సహా పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కొత్త జంట తమ పెళ్లి ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫెయిరీ టైల్ లవ్ స్టోరీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పరి చాలా అందంగా కనిపిస్తోందంటూ లైకుల వర్షం కురిపిస్తున్నారు.