టాలీవుడ్లో మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లకి కొరత లేదు. కేవలం ఒక్క విభాగానికే కట్టుబడి ఉండకుండా తమలో దాగి ఉన్న పూర్తి టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తాజాగా యాంకర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా అలరించిన రఘు కుంచె విలన్‌గా అలరించేందుకు సిద్దమయ్యాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పలాస 1978 చిత్రంలో రఘు కుంచె నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో ప్రేక్షకులని అలరించనున్నాడట. ఈ నాలుగు పాత్రలు పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్న పాత్రలట. వాటికి రఘు కుంచె న్యాయం చేస్తాడని ఆయనని చిత్ర దర్శకుడు ఎంపిక చేశారట. మరో విషయమేమంటే ఈ చిత్రానికి రఘు కుంచేనే మ్యూజిక్ అందిస్తున్నారు. ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్ .. రఘు విలన్ పాత్ర కు సూటవుతారని ఫిక్స్ చేశారు. రఘు ఈ చిత్రంలో 30,40,50,70 సంవత్సరాల వయస్సులో కనపించబోతున్నారు. తాజాగా ఆయన లుక్‌కి సంబంధించి పలు పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఇవి ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు కలిగిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘‘పలాస 1978’’ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు.