Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన మీద ఇన్నాళ్ళకి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విభజన హామీల్లో మిగతా వాటి విషయం ఎలా వున్నా నియోజకవర్గాల పెంపుకి కేంద్రం ఓకే అనడంతో ఆపరేషన్ ఆకర్ష్ తో నాయకుల బరువు ఎక్కువైన అధికార పార్టీలు ఖుషీ అవుతున్నాయి. ఈ వ్యవహారం మీద కాంగ్రెస్ గొంతు ఎత్తింది. విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పార్లమెంట్ లో నియోజకవర్గాల పెంపు బిల్లుని అడ్డుకంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రకటించారు. దీని ద్వారా ఆంధ్రాలో అంతోఇంతో సానుభూతి పొందాలని కాంగ్రెస్ ఆలోచన కావొచ్చు. కానీ దీని వల్ల విభజన పాపంతో పాటు నియోజకవర్గాల పెంపుని అడ్డుకున్న పాపాన్ని మూటగట్టుకోవడం తప్ప ఫలితం సున్నా.
కాంగ్రెస్ నిజానికి ఏపీ లో బతికిబట్ట కట్టాలంటే ఇంకా అవకాశం వుంది. అది మరేమిటో కాదు… ప్రత్యేక హోదా అంశం. ఈ అంశానికి తమ మద్దతు అంటున్న కాంగ్రెస్ మొక్కుబడి ప్రకటనలకే పరిమితం అవుతోంది. రాహుల్ హోదా కావాలని నోటి మాటగా అంటున్నారే తప్ప ఆ విషయం పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ తరపున ఆంధ్ర నాయకులు తప్ప ఇంకొకరు గొంతెత్తిన సందర్భాలే లేవు. దీంతో ఆ పార్టీకి హోదా మీదున్న చిత్తశుద్ధి ఏమిటో అర్ధం అవుతోంది. ఇప్పటికైనా నోటి మాటలు కి మాత్రమే పరిమితం కాకుండా పార్లమెంట్ లో ఏపీ కి ప్రత్యేక హోదా కోసం పూర్తి స్థాయిలో పోరాడితే కాంగ్రెస్ బతికి బట్ట కడుతుంది.
మరిన్ని వార్తలు