Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని అందరూ సరదాగా మౌనమోహన్ సింగ్ అని చమత్కరించే వారు ఎందుకంటే ఎంత రచ్చ జరుగుతున్నా సరే అయన మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేవారు. మరి అ సీటు మహిమో లేక ఆయననే ఫాలో అవుదాం అనుకున్నారో ఏమో ఇప్పుడు మోడీ కూడా చాల విషయాలలో మౌనంగా ఉంటున్నారు. ఎందరు ఎన్ని ప్రశ్నలు వేసినా… ఎంతటి అన్యాయాలు జరిగినా విని విననట్లు, చూసి చూడనట్లు మౌనమే నా బాష అన్నట్లు ప్రవర్తిస్తున్నారు మోడీ.
దీన్నే అవకాశంగా తీసుకుని ట్విట్టర్‌లో చెలరేగిపోతున్నాడు రాహుల్ గాంధీ. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) లో నీరవ్ మోడీ కుంభకోణం గురించి, రాఫెల్ జెట్ విమానాల డీల్ గురించి మోడీ మౌనంగా ఎందుకు ఉంటున్నారు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఈ రెండు అంశాల గురించి మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడాల్సిందిగా ఆయన కోరారు. 58వేల కోట్ల రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడితే వినాలని ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు అంటూ మరో ట్విట్ చేశాడు రాహుల్.
అదేమీ విచిత్రమో కానీ ఇంతకు ముందు రాహుల్ పెద్దగా మాట్లాడేవాడు కాదు, మోడీ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా తేగ మాట్లాడేవారు ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. ఇప్పుడు రాహుల్ ఎక్కువగా మాట్లాడుతుంటే మోడీ మాత్రం చాలా విషయాలలో మౌనంగా ఉంటున్నారు. సమాధానాలు చెప్పకుండా దాటవేసే ప్రయత్నమా లేక అదొక వ్యుహమా? ఏది ఏమైనా ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే… అదే మౌనమేలా మోడీ?