ఏపీలో కాంగ్రెస్ కు జాకీలు…రాహుల్ సభ…!

National Commission For Women Issues Notice To Rahul Gandhi

రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపొయింది. ఇక ఆ పార్టీ మనుగడలో ఉండదని భావించిన చెందిన కీలక నేతలంతా టీడీపీ, వైసీపీలో చేరిపోవడంతో కాంగ్రెస్ అనే పార్టీ సోయలో లేకుండా పోయింది. కొద్ది మంది నేతలు మాత్రమే తప్పక ఆ పార్టీ జెండాలను మోస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా బలపడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందు కోసం ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని కేంద్రంలో మోదీ సర్కారు తుంగలో తొక్కిందని, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఏపీలో పర్యటించనున్నారు.

rahul-gandhi-speech-in-karn

‘సత్యమేవ జయతే’ పేరుతో నిర్వహించే ఈ సభకు లక్ష మందిని సమీకరించడానికి ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలీయమైన శక్తిగా మార్చడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుపై దగాచేయబడ్డ ఏపీకి వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామన్న భరోసా ఇవ్వడానికే రాహుల్‌ వస్తున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్ష్యుడు రఘవీరా అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ పర్యటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడానికే ఈ సభ నిర్వహిస్తున్నామని రఘువీరా పేర్కొన్నారు.

rahul-and-cm