Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Rajamouli To Direct Mahesh Babu Next Coming Movie
‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న దర్శకుడు రాజమౌళి తర్వాత చేయబోతున్న సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. రాజమౌళి తర్వాత సినిమాను డివివి దానయ్య నిర్మాణంలో చేయాల్సి ఉంది. చాలా కాలం క్రితమే రాజమౌళికి దానయ్య అడ్వాన్స్ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం దానయ్య నిర్మాణంలోనే జక్కన్న సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ‘బాహుబలి’ కోసం అయిదు సంవత్సరాలు కష్టపడ్డ జక్కన్న ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇక రాజమౌళి తర్వాత సినిమా హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ రాలేదు. కథ సిద్దం అయిన తర్వాత హీరోను ఎంపిక చేస్తామని ఇటీవలే దానయ్య చెప్పుకొచ్చాడు. దానయ్య సినిమా పూర్తి అయిన తర్వాత నారాయణ నిర్మాణంలో మహేష్‌బాబు హీరోగా ఒక సినిమాను చేస్తాను అని రాజమౌళి మరోసారి ప్రకటించాడు. తాజాగా రానా షోలో పాల్గొన్న రాజమౌళి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే కథ సిద్దం అవుతుందని, హీరో ఎంపిక కూడా ఆ వెంటనే అవుతుందని జక్కన్న ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో జక్కన్న సినిమా వచ్చే అవకాశం ఉంది. అంటే మహేష్‌బాబుతో జక్కన్న సినిమా 2019 చివర్లో ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మరిన్ని వార్తాలు: