Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గరుడ వేగ సినిమా తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి ట్రైలర్ ఒక్కటే ఎక్కడలేని అట్రాక్షన్ తెచ్చిపెట్టింది. ట్రైలర్ రిలీజ్ కాగానే ఈ సినిమాకి ఎక్కడాలేని హైప్ వచ్చింది. దీంతో సినిమాకి పెద్ద ఖర్చు లేకుండానే పబ్లిసిటీ వచ్చేసింది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన హిట్ టాక్ నిలబెట్టుకోడానికి ఏమి చేస్తారా అని అందరు ఎదురు చూస్తుంటే ఓ చిన్న ట్రిక్ తో భారీ పబ్లిసిటీ తెప్పించుకున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. రిలీజ్ రోజు తీన్మార్ తప్పెట బ్యాచ్ ని హీరో రాజశేఖర్ ఇంటికి పిలిపించారు.
వారికి ఓ గంటపాటు తప్పెట కొట్టేందుకు డబ్బులు ఇచ్చి దానికి అనుగుణంగా హీరో రాజశేఖర్ కుటుంబ సభ్యులతో పాటు, గరుడ వేగ యూనిట్ డాన్స్ చేసేలా చూసారు. ఆ డాన్స్ ని వీడియో తీసి వైరల్ అయ్యేలా చూసుకున్నారు. ఇలాంటి డాన్స్ ఎన్నడూ చూడని జనాలకి వెరైటీ గా అనిపించింది. సినిమాకి హిట్ టాక్ వచ్చిందన్న విషయం ఈ వీడియో తో పాటు వైల్డ్ ఫైర్ అయ్యింది. తెర మీద కనిపించే ఖర్చు విషయంలో రాజీపడని చిత్ర యూనిట్ పబ్లిసిటీ విషయంలో ఇలాంటి ట్రిక్స్ తో పబ్లిసిటీ పని కానించి అనుకున్న రిజల్ట్ సాధించింది.