మొదటిది షురూ కాకుండానే, రెండవది..!

rajashekar-daughter-shivani

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యాంగ్రీయంగ్‌ మన్‌ రాజశేఖర్‌ కూతురు శివాని హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ఆ విషయమై అధికారిక ప్రకటన వెలువడటం జరిగింది. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన ‘2స్టేట్స్‌’ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. అడవి శేషు హీరోగా వినాయక్‌ శిష్యుడు వెంకటరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణం జరుగబోతుంది. శివాని మొదటి చిత్రం షూటింగ్‌ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇదే సంవత్సరంలో ఈ రీమేక్‌ విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్నారు. మొదటి సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే శివాని రెండవ సినిమా కూడా ఫిక్స్‌ అయ్యింది.

కన్నడ దర్శకుడు నాగశేఖర్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన వార్తు గత సంవత్సర కాలంగా మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్న రాజశేఖర్‌ ఎట్టకేలకు ఓకే చెప్పాడు. రాజశేఖర్‌ ఒక కీలక పాత్రలో నటించబోతున్న ఆ సినిమాలో శివానీతో పాటు ఒక యువ హీరో కనిపించబోతున్నాడు. రాజశేఖర్‌ ప్రధాన పాత్ర అవ్వడంతో పాటు హీరో, హీరోయిన్‌లకు కూడా అంతే ప్రాముఖ్యత ఉండేలా స్క్రిప్ట్‌ను నాగ శేఖర్‌ రెడీ చేస్తున్నాడు. అన్ని ఓకే అయితే వేసవిలో శివాని హీరోయిన్‌గా రెండవ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. మొదటి సినిమాలో అడవి శేషుతో రొమాన్స్‌ చేయబోతున్న శివాని, రెండవ సినిమాలో ఎవరితో రొమాన్స్‌ చేయనుంది అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.