Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత రెండు మూడు సంవత్సరాలుగా రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది అంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. మొదట తన కూతురు ఇప్పట్లో నటించదు అంటూ చెప్పుకొచ్చిన రాజశేఖర్ తాజాగా శివానీ హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా స్వయంగా ప్రకటించాడు. ‘గరుడవేగ’ ప్రమోషన్‌లో భాగంగా శివానీ మాట్లాడుతూ తాను వచ్చే సంవత్సరం సినిమా చేయబోతున్నట్లుగా స్వయంగా ప్రకటించింది. అయితే ఎప్పుడు, ఎవరితో, ఎలాంటి సినిమా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా శివానీ చేయబోతున్న ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చింది.
సాయి కుమార్ కుమారుడు ఆది హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో శివానీ హీరోయిన్‌గా నటించేందుకు సిద్దం అవుతుంది. ఇటీవలే ఒక కథ సిద్దం అయ్యిందని, ఆ కథలో హీరోయిన్ పాత్ర పరిధిని మరింత పెంచాలని రాజశేఖర్ సూచించాడట. త్వరలోనే రాజశేఖర్ చెప్పినట్లుగా కథలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యతను పెంచి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం వేసవిలో ఆది, శివానీల కాంబినేషన్‌లో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
సాయి కుమార్ కోరిక మేరకు రాజశేఖర్ ఈ చిత్రంలో తన కూతురు శివానీని నటింపజేస్తున్నాడు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే సినీ వర్గాల్లో మాత్రం శివానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఆదితో కాకుండా మరే ఇతర స్టార్ హీరోతో అయితే బాగుంటుందని, ఆది సక్సెస్ కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. ఆదికి జోడీగా నటించే కంటే మరే హీరోకు అయినా శివానీ జోడీగా నటించాలని, లేదంటో సోలో హీరోయిన్‌గా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాన్ని చేయాలని సూచిస్తున్నారు. మరి రాజశేఖర్ మాత్రం ఆదితోనే శివానీ చిత్రాన్ని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది.