రజినీ సూపర్‌.. తెలుగు హీరోలు అలా కాదు

Rajini Kanth Is Better Than Other Telugu heroes

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రజినీకాంత్‌ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులో కాలా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. తమిళనాడు నుండి రజినీకాంత్‌, ధనుష్‌తో పాటు ఇంకా పువురు చిత్ర యూనిట్‌ సభ్యులు హాజరు అయ్యారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఈ చిత్ర ఈవెంట్‌కు దిల్‌రాజు, మారుతి ఇంకా ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సమయంలో మారుతి మాట్లాడుతూ తెలుగు సినిమా హీరోలను కాస్త తక్కువ చేసినట్లుగా మాట్లాడాడు. తెలుగు సినిమా హీరోలతో పోల్చితే రజినీకాంత్‌ చాలా బెటర్‌ అంటూ పొగడ్తల వర్షంలో ముంచెత్తాడు. భారీ స్థాయిలో అంచనాల నడుమ రూపొందిన కాలా చిత్రం ఈనెల 7న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

‘కాలా’ ప్రీ రిలీజ్‌ వేడుకలో భాగంగా మారుతి మాట్లాడుతూ.. కబాలి చిత్రం ఫ్లాప్‌ అయినా కూడా వెంటనే రంజిత్‌ పాకు అవకాశం ఇవ్వడం అంటే చాలా గ్రేట్‌. తెలుగులో ఒక సినిమా ఫ్లాప్‌ అయితే ఆ సినిమా దర్శకుడి ఫోన్‌ను ఆ సినిమా హీరో ఎత్తకుండా ఉండటం జరుగుతుంది. తెలుగులో ఎంతో మంది హీరోలు ఇలా చేశారు. కాని తనకు ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడితో వెంటనే సినిమా చేసేందుకు ముందుకు రావడం అనేది గొప్ప విషయం అంటూ మారుతి చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని నిర్మాత దిల్‌రాజు కూడా చెప్పుకొచ్చాడు. తెలుగు హీరోలు ఫ్లాప్‌లకు చాలా భయపడతారు అని, ఒకసారి ఫ్లాప్‌ అయితే ఆ కాంబో వద్దంటే వద్దు అనుకుంటారు అంటూ దిల్‌రాజు పేర్కొన్నాడు. మొత్తానికి రజినీకాంత్‌ సూపర్‌ అంటూనే తెలుగు హీరోలు జీరోలు అనకుండానే అనేశారు.