Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ చిత్రం ఫ్లాప్ అయ్యింది. కాని ఆ సినిమా మంచి ఓపెనింగ్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ‘కబాలి’ చిత్రంలో రజినీకాంత్ సూపర్ స్టైల్‌గా కనిపించడంతో పాటు, మంచి నిర్మాణాత్మక విలువలు పాటించడం వల్ల సినిమా పర్వాలేదు అనిపించింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాకు ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. అంత వసూళ్లు చేసినా కూడా ‘కబాలి’ని ఫ్లాప్ అనేశాం. ‘కబాలి’ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ఆ చిత్ర దర్శకుడితో సినిమాను చేసేందుకు మరోసారి రజినీకాంత్ సిద్దం అవ్వగానే అంతా షాక్ అయ్యారు. ‘కబాలి’ చిత్రం సమయంలో దర్శకుడు రంజిత్ పా తన టేకింగ్ మరియు స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. అందుకే ‘కాలా’ను కూడా చేసేందుకు ఓకే చెప్పాడు.
‘కబాలి’ సినిమా ఫ్లాప్ అయినా కూడా వెంటనే ‘కాలా’ సినిమాను మొదలు పెట్టారు. కాని ఏదో ఒక కారణం, అడ్డంకులు, వివాదం వల్ల సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాలా’ చిత్రం కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది. అయితే ఈసారి కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు షాక్ అని చెప్పుకోవచ్చు. ‘కబాలి’ చిత్రం దాదాపుగా 200 కోట్లు వసూళ్లు చేస్తే ‘కాలా’ మాత్రం కేవలం 100 కోట్లకు కాస్త అటు ఇటుగానే వసూళ్లు చేసే అవకాశం కనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ ‘కాలా’ చిత్రంపై మొదటి నుండి కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కబాలి రేంజ్లో బిజినెస్ కాలేదు. దాంతో పాటు, ప్రేక్షకులు కూడా సినిమాను అంతగా చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. కబాలి సినిమా ఫ్లాప్ అని తెలిసినా కూడా రజినీకాంత్ సినిమా కనుక చూడాలి అంటూ ఎక్కువ శాతం మంది సినిమా థియేటర్లకు వెళ్లారు. కాని ‘కాలా’కు అలా జరగడం లేదు.