Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కండోమ్స్ ప్రకటనల మీద కేంద్రం కొన్ని షరతులు విధించడం తో అలాంటి ఓ యాడ్ లో నటించిన రాఖీ సావంత్ కి కోపం వచ్చింది. రాత్రి పది గంటలు దాటాకే ఆ యాడ్స్ ప్లే చేయాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ షరతు పెట్టడం మీద రాఖీ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ప్రజలకు ఎయిడ్స్ రావాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని రాఖీ ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని ఇద్దరు వ్యక్తులని కూడా రాఖీ సీన్ లోకి తెచ్చింది. అందులో ఒకరు రామ్ దేవ్ బాబా అయితే ఇంకొకరు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.
పతంజలి ఉత్పత్తుల ద్వారా వ్యాపార రంగంలో విస్తరిస్తున్న రామ్ దేవ్ బాబా ఇక కండోమ్స్ తయారీ మీద కూడా దృష్టి పెట్టాలని రాఖీ ఉచిత సలహా ఇచ్చింది. త్వరలో రామ్ దేవ్ కండోమ్స్ వాడకం లోకి రావాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఇంత దూకుడుగా మాట్లాడారు వామ్మో అనుకుంటున్నారా …అయితే ఇదేమీ దూకుడు కాదు. ఆ తర్వాత విరాట్ కి ఆమె ఇచ్చిన సలహా వింటే నోరు వెళ్ళబెట్టడం ఖాయం. అనుష్కని పెళ్లి చేసుకున్న విరాట్ తో నన్ను అన్యాయం చేసావని స్టేట్ మెంట్ ఇచ్చిన రాఖీ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వెళ్ళింది. తాను ప్రమోట్ చేస్తున్న కండోమ్ వాడాలని విరాట్ కి పిలుపు ఇచ్చింది. ఆపై అనుభవం ఎలా వుందో కూడా వివరించమని కోరింది. మొత్తానికి కండోమ్ విషయంలో కేంద్రం మీద కోపం ఉంటే ఓకే గానీ ఈ మేటర్ లోకి ఓ బాబాని , ఓ కొత్త పెళ్ళికొడుకు ని లాగడం సమంజసమా రాఖీ ?